YS Jagan: బలం లేకున్నా ప్రతిపక్షహోదా ఇవ్వాల్సిందే..!: జగన్‌ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు

వైనాట్ 175 అంటూ విర్రవీగి కేవలం 11 సీట్లకే పరిమితమై చతికలపడ్డ జగన్.. ఇప్పుడు ప్రతిపక్ష హోదాపై కొత్త భాష్యం చెబుతున్నారు.

Published : 26 Jun 2024 09:28 IST

మాట ఇవ్వడం మడమ తిప్పడమే కాదు అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, అధికారం పోయినప్పుడు మరొక మాట మాట్లడంలో సిద్ధహస్తులు జగన్ (YS Jagan). వైనాట్ 175 అంటూ విర్రవీగి కేవలం 11 సీట్లకే పరిమితమై చతికలపడ్డ జగన్.. ఇప్పుడు ప్రతిపక్ష హోదాపై కొత్త భాష్యం చెబుతున్నారు. ప్రతిపక్ష హోదాకు పదిశాతం సీట్లు ఉండాలనే నిబంధన చట్టంలో ఎక్కడా లేదంటూ వైకాపాకు ఆ హోదా ఇవ్వాలంటూ సభాపతికి జగన్ లేఖ రాశారు.

Tags :

మరిన్ని