YS Jagan: ప్రతిపక్ష నేత హోదా.. అప్పుడేం మాట్లాడావో గుర్తుందా జగన్‌?

‘చంద్రబాబుకు 23 మంది సభ్యులు ఉన్నారు. నేను డోర్లు తెరిస్తే ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదు. అక్కడ కూర్చుని ఉండేవారు కాదు’ అంటూ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా.. తనదైన అహంకార ధోరణితో నిండు సభలో చంద్రబాబు వైపు వేలు చూపిస్తూ, గుడ్లు ఉరుముతూ మరీ మాట్లాడారు.

Updated : 26 Jun 2024 13:20 IST

‘చంద్రబాబుకు 23 మంది సభ్యులు ఉన్నారు. నేను డోర్లు తెరిస్తే ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదు. అక్కడ కూర్చుని ఉండేవారు కాదు’ అంటూ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా.. తనదైన అహంకార ధోరణితో నిండు సభలో చంద్రబాబు వైపు వేలు చూపిస్తూ, గుడ్లు ఉరుముతూ మరీ మాట్లాడారు. ‘ఇదీ వాస్తవం.. తెలుసుకో’ అంటూ ఏకవచనంతో హుంకరించారు. ఆయన చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే అప్పట్లో తెదేపాకు 23 మంది సభ్యులు ఉన్నారు. వారిలో ఐదుగురిని జగన్‌ లాగేసుకుని ఉంటే తెదేపాకు 18/17 మంది మిగిలేవారు. అయినా చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా రాదని సభలో చాలా గట్టిగా జగన్‌ ఏ లెక్కన చెప్పారు? సభలోని మొత్తం సీట్లలో 10 శాతం సీట్లుంటేనే ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుందనే ఉద్దేశంతో కాదా! ప్రస్తుత సభలో తన పార్టీకి కేవలం 11 మంది సభ్యులే ఉన్నప్పటికీ.. తానే ప్రతిపక్ష నేతనని జగన్‌ చెబుతున్నారు. 

Tags :

మరిన్ని