Viral Video: వర్షంలో రీల్స్‌ చేస్తున్న యువతి సమీపంలో పిడుగుపాటు!.. వీడియో వైరల్‌

వర్షంలో రీల్స్  చేస్తున్న ఓ యువతికి భయానక ఘటన ఎదురైంది. తన సమీపంలో పెద్ద శబ్దంతో పిడుగు పడటంతో ఒక్కసారిగా అదిరిపడిన ఆ యువతి భయంతో పరుగులు తీసింది. ఆ దృశ్యాలు అక్కడే ఉన్న స్మార్ట్ ఫోన్‌లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి.

Updated : 27 Jun 2024 14:48 IST

వర్షంలో రీల్స్  చేస్తున్న ఓ యువతికి భయానక ఘటన ఎదురైంది. తన సమీపంలో పెద్ద శబ్దంతో పిడుగు పడటంతో ఒక్కసారిగా అదిరిపడిన ఆ యువతి భయంతో పరుగులు తీసింది. బిహార్‌లోని సీతామఢికి చెందిన సానియా కుమారి.. బుధవారం రీల్స్ చేయడానికి పొరుగున ఉన్న దేవనారాయణ భగత్ ఇంటి మేడపైకి వెళ్లింది. వర్షంలో డ్యాన్స్  చేస్తున్నప్పుడు ఆ దృశ్యాలు చిత్రీకరించడానికి తన ఎదుట ఓ స్మార్ట్ ఫోన్ ఏర్పాటు చేసుకుంది. సానియా నృత్యం చేస్తున్న క్రమంలో తన పక్కనే ఉన్న స్లాబ్‌పై పెద్ద శబ్దంతో పిడుగు పడింది. ఈ ఘటనతో ఒక్కసారిగా భీతిల్లిన ఆ యువతి. .అక్కడి నుంచి పరుగులు తీసింది. ఆ దృశ్యాలు అక్కడే ఉన్న స్మార్ట్ ఫోన్‌లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి.

Tags :

మరిన్ని