Kurnool: లైంగిక వేధింపుల కేసులో వైకాపా మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ అరెస్ట్‌.. 14 రోజుల రిమాండ్

కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత డాక్టర్‌ జరదొడ్డి సుధాకర్‌ వికృత చేష్టలు గురువారం వెలుగులోకి వచ్చాయి.

Published : 05 Jul 2024 11:17 IST

కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత డాక్టర్‌ జరదొడ్డి సుధాకర్‌ వికృత చేష్టలు గురువారం వెలుగులోకి వచ్చాయి. ఆయన ఓ యువతిపై గత మూడేళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డారు. కొద్దిరోజుల కిందటి వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉండడంతో బాధితురాలు మౌనంగా భరిస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ధైర్యంగా ముందుకొచ్చింది. కర్నూలు రెండో పట్టణ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేశారు. 

Tags :

మరిన్ని