Costly Marriages: భారత్‌లో అమెరికాను మించిన పెళ్లిళ్ల ఖర్చు.. దేనికి సంకేతం?

భారతీయ వివాహ పరిశ్రమ పరిమాణం ఏకంగా రూ.10 లక్షల కోట్ల ఖర్చుకు చేర్చింది. చదువుకు చేస్తున్న ఖర్చు కంటే పెళ్లిళ్లకే భారతీయులు రెట్టింపు మొత్తం వెచ్చిస్తున్నట్లు స్పష్టమైంది.

Published : 02 Jul 2024 16:21 IST

ప్రతి మనిషి జీవితంలో ఒకే ఒక్క సారి జరిగే వేడుక పెళ్లి. అందుకే ఖర్చుకు వెనకాడకుండా పెళ్లిని ఘనంగా చేసుకోవాలని అనుకుంటారు. తల్లితండ్రులు సైతం తమ హోదా చాటుకుంటూ పిల్లల వివాహాలను అంగరంగ వైభవంగా జరిపిస్తుంటారు. పేదలు కూడా అప్పు చేసైనా సరే ఓ మాదిరిగానైనా పెళ్లి చేయాలని భావిస్తారు. ఇది భారత్‌లో ఉన్న సంప్రదాయం. మరి ఈ సంప్రదాయమే భారతీయ వివాహ పరిశ్రమ పరిమాణాన్ని అమాంతం పెంచేసి ఏకంగా రూ.10 లక్షల కోట్ల ఖర్చుకు చేర్చింది. చదువుకు చేస్తున్న ఖర్చు కంటే పెళ్ళిళ్లకే భారతీయులు రెట్టింపు మొత్తం వెచ్చిస్తున్నట్లు స్పష్టమైంది. మరి ఇంతటి ఖర్చు దేనికి సంకేతం. ఉపాధి, వ్యాపార అవకాశాలను ఇది ఏ మేరకు పెంచుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు కలిగే లాభం ఎంత? ఈ వీడియోలో తెలుసుకుందాం.

Tags :

మరిన్ని