సొంతంగా బావి తవ్వుకున్న నారీమణులు

దేశంలోని అనేక ప్రాంతాల్లో చుక్క వాన లేదు. నీటి కోసం ప్రజలు అల్లాడిపోవాల్సిన పరిస్థితి. నీటి కొరతను అధిగమించేందుకు మహారాష్ట్రలోని నాసిక్‌లో సిర్సా అనే గ్రామానికి చెందిన కొందరు మహిళలు అసాధ్యం అనే పనిని సుసాధ్యం చేశారు. సొంతంగా బావి తవ్వుకున్నారు.

Published : 01 Jul 2024 15:11 IST

వేసవి వెళ్లిపోయి దాదాపు నెల రోజులైంది. అయినా దేశంలోని అనేక ప్రాంతాల్లో చుక్క వాన లేదు. నీటి కోసం ప్రజలు అల్లాడిపోవాల్సిన పరిస్థితి. ఇటీవల బెంగళూరు అనుభవమూ తెలిసిందే. మహారాష్ట్రలోని నాసిక్‌లో కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. నీటి కొరతను అధిగమించేందుకు అక్కడ సిర్సా అనే గ్రామానికి చెందిన కొందరు మహిళలు అసాధ్యం అనే పనిని సుసాధ్యం చేశారు. సొంతంగా బావి తవ్వుకున్నారు. మహిళలు తలుచుకుంటే కాని పని లేదు అని నిరూపించారు. మరో గ్రామంలో మహిళలు ప్రాణాలకు తెగించి మరీ చాలా లోతైన బావిలోకి దిగి మరీ నీరు తెచ్చుకుంటున్నారు. ఇది నాసిక్‌లో తీవ్రమైన నీటి ఎద్దడికి అద్దం పడుతోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు