Guntur: సహజసిద్ధంగా నీటిశుద్ధి.. ప్లాంట్‌ ఏర్పాటు చేసిన విజ్ఞాన్‌ వర్సిటీ

రోజురోజుకూ పెరుగుతున్న జనాభా.. అదే సమయంలో తగ్గిపోతున్న నీటి వనరులు.. ఈ రెండింటిని సమతూకం చేసి ప్రజల అవసరాలు తీర్చాలంటే నీటి పునర్వినియోగం ఒక్కటే మార్గం.

Published : 30 Jun 2024 12:59 IST

  రోజురోజుకూ పెరుగుతున్న జనాభా.. అదే సమయంలో తగ్గిపోతున్న నీటి వనరులు.. ఈ రెండింటిని సమతూకం చేసి ప్రజల అవసరాలు తీర్చాలంటే నీటి పునర్వినియోగం ఒక్కటే మార్గం. ఈ క్రమంలోనే డ్రైనేజి నీటిని రీసైక్లింగ్ చేయటంపై ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు సాగుతున్నాయి. ఐతే ఖర్చు ఎక్కువ కావటంతో రీసైక్లింగ్ ప్లాంట్ల ఏర్పాటు విషయంలో అనేకమంది వెనకడుగు వేస్తున్నారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయం మాత్రం ఈ విషయంలో ముందడుగు వేసింది. సహజసిద్ధంగా నీటిని శుద్ధి చేసే ప్రాజెక్టును విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ నిపుణులు రూపొందించారు.

Tags :

మరిన్ని