Ukraine: ఖైదీలకు ఉక్రెయిన్ ఆఫర్.. యుద్ధానికి సిద్ధమైతే జైలు నుంచి విముక్తి

యుద్ధంలో సైనికుల కొరతను అధిగమించేందుకు ఉక్రెయిన్‌ కొత్త పంథాను ఎంచుకుంది.

Published : 02 Jul 2024 12:34 IST

యుద్ధంలో సైనికుల కొరతను అధిగమించేందుకు ఉక్రెయిన్‌ (Ukraine) కొత్త పంథాను ఎంచుకుంది. రష్యా (Russia)తో యుద్ధంలో పాల్గొంటే కేసులు కొట్టేసి విడుదల చేస్తామని ఖైదీలకు ఆఫర్ ఇచ్చింది. 27 వేల మందిని నియమించుకునేందుకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలను సైతం నిర్వహిస్తోంది. అయితే అత్యాచారం, హత్య కేసుల్లో ఖైదీలుగా ఉన్న వారిని మాత్రం అనర్హులుగా ప్రకటించింది. గతంలో రష్యా కూడా ఖైదీలకు ఇలాంటి అవకాశమే ఇచ్చి వారిని సైన్యంలోకి కాకుండా కిరాయి సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌లోకి తీసుకుంది.

Tags :

మరిన్ని