Robot: చైనాలో ఆకట్టుకున్న రెండు కాళ్ల రోబో

చైనాలో లిమ్ ఎక్స్ డైనమిక్స్ సంస్థ రూపొందించిన రెండు కాళ్ల రోబోను షాంఘై నగరంలో జరుగుతున్న 2024 ప్రపంచ కృత్రిమ మేధ సదస్సులో ఆవిష్కరించారు.

Published : 05 Jul 2024 15:59 IST

చైనాలో లిమ్ ఎక్స్ డైనమిక్స్ సంస్థ రూపొందించిన రెండు కాళ్ల రోబోను షాంఘై నగరంలో జరుగుతున్న 2024 ప్రపంచ కృత్రిమ మేధ సదస్సులో ఆవిష్కరించారు. బైపెడల్ రోబోట్ పీ 1గా పిలిచే ఈ రోబో.. సదస్సుకు వచ్చిన వారిని అమితంగా ఆకర్షిస్తోంది. ఈ రోబోను కాళ్లతో తన్నినా, చేతులతో నెట్టినా కింద పడకుండా వెంటనే నిటారుగా తిరిగి  మామూలు స్థితికి చేరుకోవడమే అందుకు కారణం. చైనీస్ టెక్ సంస్థ లిమ్ ఎక్స్ దీనిని ఏఐ సాంకేతికతను ఉపయోగించి అభివృద్ధి చేసింది.

Tags :

మరిన్ని