Pawan Kalyan - Tollywood: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతల భేటీ

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీరంగం విస్తరణకు ఉన్న అవకాశాలు, తదితర కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం.

Published : 24 Jun 2024 16:00 IST

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీరంగం విస్తరణకు ఉన్న అవకాశాలు, తదితర కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకొన్న నిర్మాతలు.. అక్కడి నుంచి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అప్పుడే తొలి క్యాబినెట్‌ భేటీ ముగిసిన తర్వాత అక్కడికి చేరుకున్న పవన్‌తో సమావేశమయ్యారు.

Tags :

మరిన్ని