Ap News: టెట్‌,మెగా డీఎస్సీ సన్నద్ధతకు సమయం.. అభ్యర్థుల హర్షం

అధికారం చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటించిన ప్రభుత్వం సన్నద్ధత కోసం సమయం ఇవ్వడంపై అభ్యర్థులు.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Published : 05 Jul 2024 14:15 IST

అధికారం చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటించిన ప్రభుత్వం సన్నద్ధత కోసం సమయం ఇవ్వడంపై అభ్యర్థులు.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టెట్ పరీక్షకు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజులు గడువు ఇస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. గత ప్రభుత్వం కేవలం ఎన్నికల కోసమే హడావుడిగా టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తుచేస్తున్నారు. టెట్ ఫలితాలకు, డీఎస్సీ పరీక్షకు మధ్య కేవలం వారం రోజులు గడువు ఇచ్చి ఇబ్బంది పెట్టారని కొత్త ప్రభుత్వం మాత్రం.. తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ప్రిపరేషన్ కోసం సమయం ఇవ్వడం పట్ల అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని