Hyderabad: షాదీముబారక్‌, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రసాభాస

ఖైరతాబాద్‌ మండల కార్యాలయంలో బోరబండ, రెహమత్‌నగర్‌ డివిజన్లకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, రెహమత్‌నగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డి పాల్గొన్నారు.

Published : 29 Jun 2024 15:13 IST

షాదీముబారక్‌, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రసాభాస

ఖైరతాబాద్‌ మండల కార్యాలయంలో బోరబండ, రెహమత్‌నగర్‌ డివిజన్లకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, రెహమత్‌నగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డి పాల్గొన్నారు. ముందస్తు అనుమతితో బోరబండ కార్పొరేటర్‌ ఎండీ బాబా ఫసియుద్దీన్‌, సతీమణి హబీబా సుల్తానా, ఖైరతాబాద్‌ మండల తహసీల్దార్‌ ఎండీ నయీముద్దీన్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఏ హోదాతో కార్యక్రమానికి వచ్చారంటూ హబీబాను ఎమ్మెల్యే నిలదీశారు. దీంతో బాబా మద్దతుదారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, భారాస వర్గీయుల మధ్య గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే కార్యక్రమం నుంచి నిష్ర్కమించారు. తహసీల్దార్‌ విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే మళ్లీ వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య చెక్కుల పంపిణీ కార్యక్రమం సజావుగా సాగింది.

Tags :

మరిన్ని