Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెదేపా ఎమ్మెల్యేలు

తిరుమల శ్రీవారిని పలువురు తెదేపా (TDP) ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు.

Published : 27 Jun 2024 12:21 IST

తిరుమల శ్రీవారిని పలువురు తెదేపా (TDP) ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కళా వెంకట్రావు, ధర్మరాజు, ధూళిపాళ్ల నరేంద్ర, బి.వి.నాగేశ్వర రెడ్డి వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తితిదే ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో తెదేపా ఎమ్మెల్యేలకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.  

Tags :

మరిన్ని