Suryakumar Yadav: బౌండరీ వద్ద సూర్య సూపర్ క్యాచ్‌.. వీడియో!

దక్షిణాఫ్రికాపై అద్భుత విజయాన్ని నమోదు చేసి టీమ్‌ ఇండియా టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup)ను అందుకుంది. ఈ ట్రోఫీలో భారత ఆటగాడు సూర్యకుమార్‌ చరిత్రలో నిలిచిపోయే క్యాచ్‌ అందుకున్నాడు.

Updated : 30 Jun 2024 09:27 IST

దక్షిణాఫ్రికాపై అద్భుత విజయాన్ని నమోదు చేసి టీమ్‌ ఇండియా టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup)ను అందుకుంది. ఈ ట్రోఫీలో భారత ఆటగాడు సూర్యకుమార్‌ చరిత్రలో నిలిచిపోయే క్యాచ్‌ అందుకున్నాడు. చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరమవగా.. హార్దిక్‌ వేసిన తొలి బంతిని మిల్లర్‌ గాల్లోకి లేపాడు. అది సిక్సర్‌ వెళ్లేలా కనిపించింది. అది కానీ బౌండరీ దాటి బయట పడి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో! కానీ వైడ్‌ లాంగాఫ్‌ నుంచి మెరుపు వేగంతో పరుగెత్తుకుంటూ వచ్చిన సూర్య ఒక్క ఉదుటన బంతి అందుకున్నాడు. కానీ నియంత్రణ కోల్పోయి బౌండరీ గీత దాటాడు. అయితే అంతలోపే బంతిని గాల్లోకి విసిరాడు. తిరిగి వచ్చి ఆ బంతిని అందుకుని జట్టును ఆనందంలో ముంచెత్తాడు. అద్భుతంగా ఆ క్యాచ్‌ పట్టిన సూర్య టీమ్‌ఇండియా విజయంలో కీలకమయ్యాడు.

Tags :

మరిన్ని