Kurnool: అధికారుల నిర్లక్ష్యం.. వృథాగా పోతున్న సుంకేసుల జలాలు

కర్నూలు జిల్లాలో తుంగభద్రపై నిర్మించిన సుంకేసుల జలాశయం నిర్వహణలో అధికారుల తీరు ఆందోళన కలిగిస్తోంది.

Published : 26 Jun 2024 11:02 IST

కర్నూలు జిల్లాలో తుంగభద్రపై నిర్మించిన సుంకేసుల జలాశయం నిర్వహణలో అధికారుల తీరు ఆందోళన కలిగిస్తోంది. కర్నూలు సహా ఎన్నో గ్రామాలకు తాగు, సాగు నీరు అందించే ఈ ప్రాజెక్టును గత ఐదేళ్లుగా పట్టించుకోకపోవడంతో ఎక్కడికక్కడ లీకేజీ అవుతోంది. ఈ మధ్యనే ఎగువన కురిసిన వర్షాలకు జలాశయం పూర్తిగా నిండిపోయింది. ప్రస్తుతం ఇన్ ఫ్లో ఆగిపోయింది. ఉన్న నీటిని జాగ్రత్తగా నిల్వచేసుకోవాల్సి ఉండగా 15 గేట్ల నుంచి నీరు వృథాగా వెళ్లిపోతోంది. 

Tags :

మరిన్ని