Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య 180 మంది యుద్ధ ఖైదీల మార్పిడి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో బందీలుగా ఉన్న 180 మంది యుద్ధ ఖైదీలను ఇరుదేశాలు మార్చుకున్నాయి. ఉక్రెయిన్  తమ ఆధీనంలోని 90 మంది రష్యా సైనికులను వారి స్వదేశానికి పంపగా.. తమ దగ్గర బందీలుగా ఉన్న 90 మంది యుద్ధ ఖైదీలను ఉక్రెయిన్ అధికారులకు రష్యా అప్పగించింది.

Updated : 26 Jun 2024 19:21 IST

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో బందీలుగా ఉన్న 180 మంది యుద్ధ ఖైదీలను ఇరుదేశాలు మార్చుకున్నాయి. గడిచిన 24 గంటల్లో జెలెన్‌స్కీ సేనలపై భీకర దాడులు చేసినట్లు రష్యా వెల్లడించింది. ఉక్రెయిన్ ఆయుధాగారాలు, రాడార్ స్టేషన్లు, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపినట్లు క్రెమ్లిన్ ప్రకటించింది. కీవ్ దళాలు ప్రయోగించిన రాకెట్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు మధ్యలోనే నేలకూల్చినట్లు పుతిన్ సేనలు పేర్కొన్నాయి. ఈ పోరులో పైచేయి సాధించినట్లు వెల్లడించాయి. దీనిపై స్పందించిన కీవ్.. రష్యా దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఇరు దేశాల అధికారులు యుద్ధ ఖైదీల అప్పగింతపై చర్చలు జరిపారు. అందులో భాగంగా ఉక్రెయిన్  తమ ఆధీనంలోని 90 మంది రష్యా సైనికులను వారి స్వదేశానికి పంపగా.. తమ దగ్గర బందీలుగా ఉన్న 90 మంది యుద్ధ ఖైదీలను ఉక్రెయిన్ అధికారులకు రష్యా అప్పగించింది. దీనిపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. తమ 90 మంది సైనికులు స్వదేశానికి చేరుకున్నట్లు ధ్రువీకరించారు. ఇరు దేశాల మధ్య అతిపెద్ద యుద్ధ ఖైదీల మార్పిడి 400 మంది బందీలతో జనవరి 3న జరిగింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు