Manjeera: మంజీర అభయారణ్యంలో ప్రకృతి సోయగం..!

ఆహ్లాదకర వాతావరణం, ఎన్నో జాతుల పక్షులు, వన్యప్రాణులకు నిలయం మంజీర అభయారణ్యం. సింగూరు నుంచి మంజీర వరకు 9 ద్వీపాలు ఉండటం దీని ప్రత్యేకత. ఈ ప్రాంతానికి ‘రాంసర్ సైట్’గా గుర్తింపు దక్కించుకునేందుకు తెలంగాణ అటవీశాఖ ప్రయత్నాలు చేస్తోంది. మంజీర అభయారణ్యం ప్రత్యేకతలేంటో చూద్దాం.

Updated : 29 Jun 2024 18:04 IST

పక్షుల కిలకిలలు, నెమళ్ల నాట్యాలు, అడవి కోళ్ల కొక్కొరొక్కోలు.. చుట్టూ ఆహ్లాదకర వాతావరణం. పక్కనే హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించే మంజీరా నది. ఇంత సుందరమైన ప్రాంతమే మంజీర అభయారణ్యం. సింగూరు నుంచి మంజీర వరకు 9 ద్వీపాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. జింకలు, కొండచిలువలు, పాములు, దుప్పులు, అడవి పిల్లులు సహా అనేక జంతువులు, మొసళ్లు, సహా సరీసృపాల సమాహారం మంజీర పరివాహకంలోని ఈ ద్వీపాలు. వైవిధ్యాన్ని చాటుకుంటూ పర్యటకుల మనసును దోచుకుంటోంది. అంతటి ప్రకృతి రమణీయంగా ఉన్న ఈ ప్రాంతానికి ‘రాంసర్ సైట్’గా గుర్తింపు తీసుకొంచ్చేందుకు తెలంగాణ అటవీశాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంజీర అభయారణ్యం ప్రత్యేకతలు, ఇక్కడి తొమ్మిడి ద్వీపాల విశిష్టతలు యునెస్కో-రాంసర్ సైట్‌గా గుర్తింపు లభిస్తే కలిగే ప్రయోజనాలు తదితర అంశాలు ఇప్పుడు చూద్దాం.

Tags :

మరిన్ని