AP News: ఇంటి ముందు గేట్లు మూసేసిన జగన్‌.. ఇప్పుడైనా దారి ఇస్తారా?

మన ఇళ్ల మధ్యకు ఆయన వస్తున్నారని సంబరపడ్డారు. వీవీఐపీ తమ ప్రాంతంలో ఉంటే అదనపు ప్రయోజనాలు చేకూరుతాయని ఆశపడ్డారు..!

Published : 30 Jun 2024 13:27 IST

మన ఇళ్ల మధ్యకు ఆయన వస్తున్నారని సంబరపడ్డారు. వీవీఐపీ తమ ప్రాంతంలో ఉంటే అదనపు ప్రయోజనాలు చేకూరుతాయని ఆశపడ్డారు..! కానీ అదనపు ప్రయోజనాల సంగతి దేవుడెరుగు అసలుకే ఎసెరుపెట్టారు. కనీసం తమ ఇళ్లకు వెళ్లేందుకు దారి కూడా లేక ఐదేళ్ల పాటు అగచాట్లుపడ్డారు. భద్రతాపరమైన కారణాలతో తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్ చుట్టుపక్కల వారికి చుక్కలు చూపించారు.

Tags :

మరిన్ని