Prabhas: నేనలా చేయబోతే.. అమితాబ్‌ కూడా అలానే చేస్తానన్నారు: ప్రభాస్‌

అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan)ను తొలిసారి చూడగానే పాదాలు తాకి, ఆశీస్సులు తీసుకునేందుకు ప్రయత్నించగా ఆయన అలా చేయొద్దన్నారని ప్రభాస్‌ (Prabhas) పేర్కొన్నారు.

Published : 21 Jun 2024 18:33 IST

అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan)ను తొలిసారి చూడగానే పాదాలు తాకి, ఆశీస్సులు తీసుకునేందుకు ప్రయత్నించగా ఆయన అలా చేయొద్దన్నారని ప్రభాస్‌ (Prabhas) పేర్కొన్నారు. ‘నువ్వు ఆపకపోతే నేనూ నీ పాదాలు తాకుతా’ అని అన్నారని గుర్తుచేసుకున్నారు. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడిన ప్రభాస్‌.. ‘అప్పట్లోనే దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు అమితాబ్‌ బచ్చన్‌. పొడుగు వారందరినీ ఆయనతో పోల్చేవారు. కమల్‌ సర్‌ ‘సాగర సంగమం’ సినిమా చూసి, అందులో ఆయన ధరించిన దుస్తులు కావాలని అమ్మను అడిగా. ‘ఇంద్రుడు చంద్రుడు’లోని ఆయన నటనకు ఫిదా అయ్యా. దీపికా పదుకొణె.. గొప్ప నటి, సూపర్‌స్టార్‌’ అని ప్రభాస్‌ పేర్కొన్నారు. 

Tags :

మరిన్ని