Polavaram Project: ప్రణాళిక లోపంతోనే పోలవరం విధ్వంసం: ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి

జగన్‌ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా విధ్వంసమైందని శ్వేతపత్రం స్పష్టంచేసింది.

Published : 29 Jun 2024 09:30 IST

జగన్‌ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా విధ్వంసమైందని శ్వేతపత్రం స్పష్టంచేసింది. 2020 జులై నుంచి 2024 జూన్ వరకు ప్రధాన డ్యాం, డయాఫ్రంవాల్‌లకు సంబంధించిన ఏ పనులూ చేయలేదని తేల్చింది. గుత్తేదారుడిని మార్చడం వల్ల రివర్స్ టెండర్లతో నిధులు ఆదా చేశామని చెబుతున్నా ఆ తర్వాత అదే గుత్తేదారుడికి అదనపు పనులు అప్పచెప్పడం వల్ల రూ.2,268 కోట్ల అదనపు భారం పడిందని మొత్తంగా రివర్స్ టెండర్లలో ఆదా ఒట్టిదేనని స్పష్టం చేసింది. సకాలంలో ఎగువ కాఫర్ డ్యాం ఖాళీలను పూడ్చకపోవడంతో డయాఫ్రంవాల్  దెబ్బతిందని పేర్కొంది. ప్రధాన డ్యాం ప్రాంతం అంతా అగాధాలతో నిండిపోయిందని వివరించింది. వీటన్నింటిని కొలిక్కితెచ్చి 2028 జూన్‌కు ప్రాజెక్టు తొలిదశ పూర్తిచేస్తామని శ్వేతపత్రంలో స్పష్టం చేసింది.

Tags :

మరిన్ని