Nellore: ప్రభాస్‌ ‘కల్కి’లో పెరుమాళ్లపాడులోని నాగేశ్వరస్వామి ఆలయం..!

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడులోని నాగేశ్వరస్వామి ఆలయం వార్తల్లోకెక్కింది. వెండితెరపై రికార్డులు సృష్టిస్తోన్న ప్రభాస్ కొత్త సినిమా కల్కిలో ఈ ఆలయం గురించి ప్రస్తావించారనే ప్రచారం జరుగుతోంది.

Published : 29 Jun 2024 13:53 IST

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడులోని నాగేశ్వరస్వామి ఆలయం వార్తల్లోకెక్కింది. వెండితెరపై రికార్డులు సృష్టిస్తోన్న ప్రభాస్ కొత్త సినిమా కల్కిలో ఈ ఆలయం గురించి ప్రస్తావించారనే ప్రచారం జరుగుతోంది. శతాబ్దాల క్రితం నాటి ఈ ఆలయంలోనే అమితాబ్‌బచ్చన్ ఉన్నట్లు సినిమాలో చూపించారని నెటిజన్లు వెతికేస్తున్నారు. పెన్నానది తీరంలో దశాబ్దాలపాటు ఇసుక పొరల్లో ఉండిపోయిన ఈ చారిత్రక ఆలయం 2020లో ఇసుక తవ్వకాలు చేస్తుండగా బయటపడింది. పరశురాముడు ప్రతిష్ఠించిన ఈ కోవెల 1850నాటి వరదలకు ఇసుకలో కూరుకుపోయిందని భావిస్తున్నారు. ఇప్పుడు కల్కి సినిమా ప్రభావంతో ఈ ఆలయంపై మళ్లీ చర్చ జరుగుతోంది.

Tags :

మరిన్ని