Pawan Kalyan: ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి: పవన్‌ కల్యాణ్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) తెలిపారు.

Published : 02 Jul 2024 18:32 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) తెలిపారు. కాకినాడ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన కూతురు కిడ్నాప్‌ అయ్యిందని ఇటీవల ఓ మహిళ ఆయనకు ఫిర్యాదు చేసినట్లు పవన్‌ తెలిపారు. దీనిపై విచారణకు ఆదేశించగా పోలీసులు పోలీసులు జమ్మూకశ్మీర్‌లో ఆ అమ్మాయి ఆచూకీ గుర్తించినట్లు చెప్పారు. 9 నెలల క్రితం మిస్సయిన అమ్మాయి కేసును 48 గంటల్లో ఛేదించారని పోలీసులను కొనియాడారు. ఆడపిల్లల అదృశ్యంపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసేలా చూస్తానని పవన్‌ స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని