Siddipet: కోమటిచెరువులో చిక్కుకున్న పర్యాటకుల బోటు.. తప్పిన ప్రమాదం

సిద్దిపేట కోమటి చెరువులో పెను ప్రమాదం తప్పింది. పర్యాటకులతో వెళ్తున్న బోటు చెరువులో ఉన్న వలకు చుట్టుకుని ఆగిపోయింది.

Published : 28 Jun 2024 14:01 IST

సిద్దిపేట కోమటి చెరువులో పెను ప్రమాదం తప్పింది. పర్యాటకులతో వెళ్తున్న బోటు చెరువులో ఉన్న వలకు చుట్టుకుని ఆగిపోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మరో చిన్న పడవలో ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది ఆగిపోయిన బోటుకు తాళ్లు కట్టి బయటికి లాక్కొచ్చారు. ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో బోటు నిర్వాహకులపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని