Venkatesh: వెంకటేశ్- అనిల్‌ రావిపూడి కాంబోలో మరో సినిమా ప్రారంభం

‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన కాంబో మరోసారి రిపీట్‌ కానుంది.

Updated : 03 Jul 2024 19:09 IST

‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన కాంబో మరోసారి రిపీట్‌ కానుంది. వెంకటేశ్, అనిల్‌ రావిపూడి కలయికలో మరో చిత్రం సిద్ధమవుతోంది. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ కథానాయికలు. బుధవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. రాఘవేంద్రరావు, వంశీపైడిపల్లి, సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

మరిన్ని