Phone Tapping: ఫోన్‌ ట్యాపింగ్‌ కుట్రలో నవీన్‌రావు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు క్రమంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కుట్రలో నవీన్‌రావుకు భాగమున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

Published : 04 Jul 2024 09:50 IST

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు క్రమంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కుట్రలో నవీన్‌రావుకు భాగమున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్‌రావుతోపాటు నవీన్‌రావు సూచనలతోనే పలువురి ఫోన్లను ప్రణీత్‌రావు బృందం ట్యాప్‌ చేసినట్లు వెల్లడైంది. రాజకీయ నేతలతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ ఉన్నతాధికారుల ఫోన్లపైనా నిఘా పెట్టినట్లు తేలింది. ప్రస్తుత ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌రెడ్డితోపాటు ఐఏఎస్‌ అధికారులు రొనాల్డ్‌రాస్, దివ్య ఆ జాబితాలో ఉన్నట్లు తాజాగా బహిర్గతమైంది. హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిన ఈ కేసులో దర్యాప్తు అధికారులు బుధవారం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. అందులో పలు కీలక అంశాలను వెల్లడించారు.

Tags :

మరిన్ని