Human Finger: కోన్‌ ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు! వైద్యుడుకి ఊహించని అనుభవం

ఐస్‌క్రీమ్‌ ఆర్డర్ చేస్తే అందులో మనిషి వేలు బయటపడిన భయానక అనుభవం.. ముంబయిలోని ఒక వైద్యుడికి ఎదురైంది.

Published : 14 Jun 2024 13:30 IST

ఐస్‌క్రీమ్‌ ఆర్డర్ చేస్తే అందులో మనిషి వేలు (Human Finger) బయటపడిన భయానక అనుభవం.. ముంబయిలోని ఒక వైద్యుడికి ఎదురైంది. యువ డాక్టర్ ‘ఓర్లెమ్ బ్రెండన్’ తన సోదరితో కలిసి మూడు ఐస్‌క్రీమ్‌లను ఆర్డర్ పెట్టారు. వారు కొనుగోలు చేసిన కోన్ ఐస్‌క్రీమ్‌లను ఆ సంస్థ డెలివరీ చేసింది. దానిని తినడం మొదలు పెట్టిన ఆయనకు నాలుకకు ఏదో గట్టిగా తగిలింది. అనుమానం వచ్చి దానిని పరీక్షగా చూడగా అది 2 అంగుళాల మనిషి వేలు అని తేలింది. ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యినట్లు ఆ వైద్యుడు తెలిపారు. స్వయంగా డాక్టర్ కావడంతో అది మనిషి వేలేనన్న విషయాన్ని ధ్రువీకరించుకున్నారు. అనంతరం మలాడ్‌లోని పోలీస్‌స్టేషన్‌లో ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. 

Tags :

మరిన్ని