Koushik Reddy: మంత్రి పొన్నం ఏ తప్పూ చేయకపోతే.. ప్రమాణానికి ఎందుకు రాలేదు?: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి

తన సవాల్‌ను స్వీకరించకపోవడం వల్ల ఫ్లైయాష్ రవాణాలో మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.100 కోట్ల అవినీతికి పాల్పడినట్లు నిరూపితమైందని భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Koushik Reddy) ఆరోపించారు.

Published : 26 Jun 2024 16:06 IST

తన సవాల్‌ను స్వీకరించకపోవడం వల్ల ఫ్లైయాష్ రవాణాలో మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.100 కోట్ల అవినీతికి పాల్పడినట్లు నిరూపితమైందని భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Koushik Reddy) ఆరోపించారు. ఆయన ఏ తప్పూ చేయకుంటే జూబ్లీహిల్స్‌లోని వేంకటేశ్వర స్వామి గుడిలో ప్రమాణం చేయాలని తాను విసిరిన సవాల్‌ను మంత్రి ఎందుకు స్వీకరించలేదని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ఇవాళ తెలంగాణ భవన్ నుంచి కార్యకర్తలతో కలిసి ఆలయానికి వచ్చిన కౌశిక్ రెడ్డి.. స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. బ్లాక్‌బుక్‌లో మొదటగా మంత్రి పొన్నం ప్రభాకర్ పేరు రాశారు. కేసీఆర్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ నేతల అవినీతిని బయటపెడతామని కౌశిక్‌రెడ్డి అన్నారు.

Tags :

మరిన్ని