Tummala: రైతుల సౌకర్యార్థం ప్రతి సర్వే నంబర్‌కు భూసార పరీక్షలు: మంత్రి తుమ్మల

రుణమాఫీ, రైతు భరోసా, పంట బీమా, రైతు బీమా పథకాల అమలు కోసం రానున్న మూడు నెలల కాలంలో రూ.50 వేల నుంచి రూ.60 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయబోతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Updated : 02 Jul 2024 20:34 IST

రుణమాఫీ, రైతు భరోసా, పంట బీమా, రైతు బీమా పథకాల అమలు కోసం రానున్న మూడు నెలల కాలంలో రూ.50 వేల నుంచి రూ.60 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయబోతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లో రూ.7.90 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ, ఉద్యాన శాఖల జిల్లా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైతుల సౌకర్యార్థం ప్రతి సర్వే నంబర్‌కు భూసార పరీక్షలు చేసి ఫలితాలు అందజేయాలని ఆదేశించారు.

Tags :

మరిన్ని