Nimmala Ramanaidu: పట్టిసీమ ద్వారా నీటిని విడుదల చేసిన మంత్రి నిమ్మల

పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగు, తాగునీటిని మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు.

Published : 03 Jul 2024 13:39 IST

      దేశాన్ని కరవు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని ఏపీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) అన్నారు. ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబేనని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుతోనే నదుల అనుసంధానం సాకారమన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగు, తాగునీటిని మంత్రి విడుదల చేశారు. 4, 5, 6 పంపుల ద్వారా 1,050క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. అక్కడ యంత్రాలు, మోటార్లకు పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.

Tags :

మరిన్ని