Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్‌కు మంచి స్పందన

కష్టాల్లో ఉన్న వారికి అండగా తానున్నానంటూ ‘ప్రజాదర్బార్’కు వచ్చిన ప్రజలకు మంత్రి నారా లోకేశ్‌ భరోసా ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో నిర్వహించిన ‘ప్రజాదర్బార్’కు మంగళగిరితో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.

Published : 26 Jun 2024 14:05 IST

కష్టాల్లో ఉన్న వారికి అండగా తానున్నానంటూ ‘ప్రజాదర్బార్’కు వచ్చిన ప్రజలకు మంత్రి నారా లోకేశ్‌ భరోసా ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో నిర్వహించిన ‘ప్రజాదర్బార్’కు మంగళగిరితో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. గౌరవ వేతనాలు పెంచాలంటూ పెదవడ్లపూడి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు లోకేశ్‌కు విజ్ఞప్తిచేశారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.3 వేల గౌరవ వేతనాన్ని రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచాలని కోరారు. సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని లోకేశ్‌ హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తామని మంత్రి స్పష్టంచేశారు.

Tags :

మరిన్ని