Nara Lokesh: గతంలో డీఎస్సీకి దరఖాస్తు చేసిన వారికి ఫీజు మినహాయింపు: మంత్రి నారా లోకేశ్

గత ప్రభుత్వ హయాంలో ప్రకటించిన డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారికి మెగా డీఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి నారా లోకేశ్ అధికారులకు సూచించారు.

Published : 03 Jul 2024 09:38 IST

గత ప్రభుత్వ హయాంలో ప్రకటించిన డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారికి మెగా డీఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి నారా లోకేశ్ అధికారులకు సూచించారు. ఎలాంటి విమర్శలకు తావులేకుండా మెగా డీఎస్సీని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం టెట్, డీఎస్సీ నిర్వహణ సహా నైపుణ్య గణన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు