West Godavari: వైకాపా ప్రభుత్వ పాపాలు.. పొలాల్లోకి నీరు చేరి రైతుల అవస్థలు

ధాన్యాగారంగా పేరుగాంచిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరి సాగుకు అనువైన జలవనరుల అభివృద్ధి కొన్నేళ్లుగా కుంటుపడింది. వైకాపా హయాంలో ప్రధాన కాలువల నుంచి పంట బోదెల వరకు, మేజర్ నుంచి మైనర్ డ్రెయిన్ల వరకు నిర్వహణ లేక జలవనరుల వ్యవస్థ నిర్వీర్యమైంది.

Published : 26 Jun 2024 12:24 IST

ధాన్యాగారంగా పేరుగాంచిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరి సాగుకు అనువైన జలవనరుల అభివృద్ధి కొన్నేళ్లుగా కుంటుపడింది. వైకాపా హయాంలో ప్రధాన కాలువల నుంచి పంట బోదెల వరకు, మేజర్ నుంచి మైనర్ డ్రెయిన్ల వరకు నిర్వహణ లేక జలవనరుల వ్యవస్థ నిర్వీర్యమైంది. కాలువల్లో పెద్దఎత్తున పూడికలు ఏర్పడటంతో నీటి ప్రవాహం సాఫీగా సాగక చేలకు నీరందడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొత్త ప్రభుత్వంలో సకాలంలో కాలువల ప్రక్షాళన,  మరమ్మతులు చేపట్టి సాగునీటికి ఇబ్బందుల్లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.

Tags :

మరిన్ని