Kamal Haasan: కల్కిలో నా లుక్‌ కోసం చాలా రీసెర్చ్‌ చేయాల్సి వచ్చింది..!: కమల్‌ హాసన్‌

సాధారణంగా కనిపించే వ్యక్తులు అసాధారణ పనులు చేస్తుంటారని అగ్రనటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) అన్నారు.

Published : 21 Jun 2024 20:09 IST

సాధారణంగా కనిపించే వ్యక్తులు అసాధారణ పనులు చేస్తుంటారని అగ్రనటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) అన్నారు. నాగ్‌ అశ్విన్‌తో కాసేపు మాట్లాడగానే తన టాలెంట్‌ అర్థమైందని చెప్పారు. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ‘నేను ఈ మూవీలో బ్యాడ్‌మ్యాన్‌గా కనిపిస్తా. నా లుక్‌ విభిన్నంగా ఉండాలని ముందే నిర్ణయించుకున్నాం. ఆ సమయానికి ఈ చిత్రానికి సంబంధించిన ఏ విజువల్స్‌నూ నేను చూడలేదు. కొత్త గెటప్‌ కోసం కొంత రీసెర్చ్‌ చేసి వస్తే.. ఆ లుక్‌లోనే అమితాబ్‌ నటిస్తున్నారని తెలిసింది. మరో గెటప్‌తో వస్తే.. ప్రభాస్‌ ఇలానే కనిపించనున్నారని సమాధానం ఇచ్చారు. చివరకు ఓ లుక్‌ సెట్‌ అయింది. వెండితెరపై దాన్ని చూసిన ప్రేక్షకులు ఎలా స్పందిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని కమల్‌ చెప్పారు.

Tags :

మరిన్ని