TS News: గొర్రెల కుంభకోణం.. సన్నిహితుల ఖాతాల్లోకి లంచం సొమ్ము!

తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో అవినీతి నిరోధక సంస్థ దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Published : 26 Jun 2024 10:03 IST

తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో అవినీతి నిరోధక సంస్థ దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఓఎస్డీగా పని చేసిన కల్యాణ్ కుమార్ ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించినట్లు అధికారులు గుర్తించి మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో పలు అంశాలు బహిర్గతమయ్యాయి. దళారుల నుంచి తన సన్నిహితుల బ్యాంకు ఖాతాలకు కల్యాణ్‌కుమార్‌ లంచం సొమ్మును బదిలీ చేయించుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా షీప్‌ రియరింగ్‌ డిస్ట్రిబ్యూషన్‌ (ఎస్‌ఆర్‌డీ) పథకాన్ని పర్యవేక్షించిన కల్యాణ్‌కుమార్‌తో పాటు మరికొందరు ఒక్కో యూనిట్‌కు రూ.2 వేల చొప్పున అనధికారికంగా లబ్ధి పొందినట్లు దర్యాప్తులో తేలింది. 

Tags :

మరిన్ని