Kadiyam Srihari: విద్యార్థులకు పాఠాలు బోధించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని, ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Published : 28 Jun 2024 20:23 IST

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని, ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అన్ని సదుపాయాలు సరిగా ఉన్నాయో లేదా అని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వంట గదిలో అన్నం, కూరలను రుచి చూశారు. విద్యార్థులకు పెట్టే కోడిగుడ్ల సైజు చిన్నదిగా ఉందని అధికారులను మందలించారు. ఆదర్శ పాఠశాలలో ఇంటర్‌ విద్యార్థులకు రసాయన శాస్త్రం పాఠాలు బోధించారు.

Tags :

మరిన్ని