Jasprit Bumrah: కుటుంబంతో కలిసి బుమ్రా గెలుపు సంబరాలు

టీమ్‌ఇండియా ఆపద్బాంధవుడు జస్‌ప్రీత్‌ బుమ్రా టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో సత్తా చాటాడు. తుదిపోరులో ఓటమి దిశగా సాగుతున్న జట్టును 18 ఓవర్లో రెండు పరుగులే ఇచ్చి, ఓ వికెట్‌ తీసి బుమ్రా గెలుపు వైపు మళ్లించాడు. ట్రోఫీని కైవసం చేసుకున్న అనంతరం బుమ్రా తన కుటుంబంతో కలిసి ఆనందాన్ని పంచుకున్నాడు.

Published : 30 Jun 2024 09:13 IST

జట్టు కష్టాల్లో పడిందా.. ఓటమి కోరల్లో చిక్కుకుందా? అయితే అతనికి బంతి అందించాల్సిందే. అతనే టీమ్‌ఇండియా ఆపద్బాంధవుడు జస్‌ప్రీత్‌ బుమ్రా(Jasprit Bumrah). టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో 8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లతో అతను సత్తా చాటాడు. ముఖ్యంగా తుదిపోరులో ఓటమి దిశగా సాగుతున్న జట్టును 18 ఓవర్లో రెండు పరుగులే ఇచ్చి, ఓ వికెట్‌ తీసి బుమ్రా గెలుపు వైపు మళ్లించాడు. ట్రోఫీని కైవసం చేసుకున్న అనంతరం బుమ్రా తన కుటుంబంతో కలిసి ఆనందాన్ని పంచుకున్నాడు. ఆ ఆనంద క్షణాలు మీకోసం.

Tags :

మరిన్ని