Green Buildings: హరిత భవనాలు.. ఎన్నో ప్రయోజనాలు

కాంక్రీట్ జంగిల్స్‌గా నగరాలు మారుతున్న తరుణంలో.. అక్కడి భవనాలు పర్యావరణహితంగా ఉన్నాయా? అంటే లేవనే చెప్పాలి. కాలుష్యం పెరుగుదలకు, కర్బన ఉద్గారాల విడుదలకు అవి ఓ రకంగా కారణం అవుతున్నాయి. వీటి పరిష్కారంలో భాగంగా హరిత భవనాల ఆవశ్యకత ఏర్పడింది. 

Published : 26 Jun 2024 15:18 IST

ఎటు చూసినా భారీ భవనాలు. ఆకాశ హర్మ్యాలు, వాణిజ్య సముదాయాలు, మెట్రో, రేల్వే స్టేషన్లు వెరసి కాంక్రీట్ జంగిల్స్‌గా నగరాలు మారుతున్న వైనం. మరి ఆ భవనాలు పర్యావరణహితంగా ఉన్నాయా? అంటే లేవనే చెప్పాలి. కాలుష్యం పెరుగుదలకు, కర్బన ఉద్గారాల విడుదలకు అవి ఓ రకంగా కారణం అవుతున్నాయి. వీటి పరిష్కారంలో భాగంగా హరిత భవనాల ఆవశ్యకత ఏర్పడింది. చుట్టూ వెలుతురు, పచ్చని చెట్లు, ఆహ్లాదమైన వాతావరణంతో కూడిన హరిత భవనాలు పర్యావరణ హితానికి తోడ్పడతాయి. ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అందుకే క్రమంగా హరిత భవనాలకు ఆదరణ పెరుగుతోంది. ఈ తరహాలో నిర్మించిన భవనాలకు రేటింగ్స్‌ను ఇస్తున్న భారత హరిత భవనాల సమాఖ్య.. నూతన నిర్మాణాలను పర్యవేక్షిస్తూ కట్టడాలకు సూచనలు సలహాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో హరిత భవనాల ప్రాముఖ్యత, పర్యావరణానికి కలిగే మేలు తదితర అంశాలు తెలుసుకుందాం.

Tags :

మరిన్ని