Anantapur: ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ వర్షం కురిసింది. గాలివానకు అనేకచోట్ల రోడ్లపై చెట్లుపడి రాకపోకలు నిలిచిపోయాయి.

Published : 02 Jun 2024 21:29 IST

ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ వర్షం కురిసింది. గాలివానకు అనేకచోట్ల రోడ్లపై చెట్లుపడి రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగడంతో గ్రామాల్లో చీకట్లు అలముకున్నాయి. పుల్లంపేట మండలం వత్తలూరులో పిడుగు పడి.. పూరిగుడిసె దగ్ధమైంది. కుండపోతకు వాగులు వంకలు పొర్లి.. వాహన చోదకులు ఇబ్బందిపడ్డారు.

Tags :

మరిన్ని