Harish Rao: ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?: హరీశ్‌రావు

అధికారంలోకి రాగానే ఒక్క సంతకంతో నిరుద్యోగుల సమస్యలు పరిష్కారిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి సంతకం ఇప్పుడేమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.

Published : 30 Jun 2024 19:03 IST

అధికారంలోకి రాగానే ఒక్క సంతకంతో నిరుద్యోగుల సమస్యలు పరిష్కారిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి సంతకం ఇప్పుడేమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ప్రశ్నించారు. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆస్పత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతిలాల్‌ నాయక్‌ను హరీశ్‌రావు పరామర్శించారు. జాబ్ క్యాలెండర్ సహా అనేక హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అటకెక్కించిందని మండిపడ్డారు. గ్రూప్‌ 2, గ్రూప్‌ 3 పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్‌ చేశారు.

Tags :

మరిన్ని