Suryapet: వాహనంపై ఊరేగించి.. ఉపాధ్యాయుడికి ఘనంగా విద్యార్థుల వీడ్కోలు

సూర్యాపేట జిల్లా నూతనకల్‌లో ఓ గురువుకు అరుదైన గౌరవం దక్కింది. వ్యాయామ ఉపాధ్యాయుడిగా తమకు అత్యున్నత శిక్షణ ఇచ్చి.. ఉన్నత శిఖరాలను అధిరోహించేలా కృషి చేసిన గురువును విద్యార్థులు ఘనంగా సత్కరించారు.

Published : 29 Jun 2024 19:41 IST

సూర్యాపేట జిల్లా నూతనకల్‌లో ఓ గురువుకు అరుదైన గౌరవం దక్కింది. వ్యాయామ ఉపాధ్యాయుడిగా తమకు అత్యున్నత శిక్షణ ఇచ్చి.. ఉన్నత శిఖరాలను అధిరోహించేలా కృషి చేసిన గురువును విద్యార్థులు ఘనంగా సత్కరించారు. పట్టణంలోని పాఠశాలలో తూము హన్మంతరావు వ్యాయామ ఉపాధ్యాయుడిగా 15 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన శిష్య బృందంలో పీఈటీలు, పోలీసులు ఎంతో మంది ఉన్నారు. ఆయన ఉద్యోగ విరమణ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆ గురువును ఘనంగా సన్మానించారు. పాఠశాల నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫంక్షన్ హాల్ వరకు వాహనంపై ఊరేగిస్తూ.. పూలు చల్లుతూ.. తమ గురుభక్తి చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత, పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై గురుభక్తి చాటుకున్నారు.

Tags :

మరిన్ని