Allu Aravind: సినీ పరిశ్రమ సమస్యలపై త్వరలో సీఎం చంద్రబాబుకు రిప్రజెంటేషన్‌ ఇస్తాం: అరవింద్‌

ఏపీ సీఎం చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని డిప్యూటీ సీఎం పవన్‌ను కోరినట్టు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు.

Updated : 24 Jun 2024 18:06 IST

ఏపీ సీఎం చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని డిప్యూటీ సీఎం పవన్‌ను కోరినట్టు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అరవింద్‌ మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్‌ను సినీ పరిశ్రమ తరపున అభినందించినట్టు చెప్పారు. సినీ రంగంలోని అన్ని అసోసియేషన్లు కలసి వచ్చి సీఎం చంద్రబాబును అభినందిస్తామని చెప్పినట్టు వివరించారు. త్వరలోనే అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తామని పవన్‌ చెప్పారని పేర్కొన్నారు. 

Tags :

మరిన్ని