Anil Ravipudi: వెంకటేశ్‌తో మరో ఫన్‌ సినిమా.. ఎఫ్‌ 4 కాదు: అనిల్‌ రావిపూడి

తిరుమల శ్రీవారిని సినీ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శించుకున్నారు.

Published : 05 Jul 2024 18:53 IST

తిరుమల శ్రీవారిని సినీ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. గర్భాలయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన అనిల్‌.. దిల్‌రాజు బ్యానర్‌లో వెంకటేశ్‌ హీరోగా సినిమా చేస్తున్నట్లు చెప్పారు. ఆ సినిమాపై అనేక గాసిప్స్‌ వస్తున్నాయని, అది ఎఫ్‌ 4 కాదని స్పష్టం చేశారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు