TG News: కుటుంబానికి రూ.2 లక్షల పంట రుణమాఫీ.. నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు: సీఎం రేవంత్‌రెడ్డి

రైతు రుణమాఫీ మార్గదర్శకాలను 3, 4 రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Published : 29 Jun 2024 10:01 IST

రైతు రుణమాఫీ మార్గదర్శకాలను 3, 4 రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రూ. 2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామన్నారు. బంగారం తాకట్టు రుణాలు దీని పరిధిలోకి రావని స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ.. ఎస్‌ఎల్‌బీసీ మార్గదర్శకాల ప్రకారం తీసుకున్న పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయన్నారు. రుణమాఫీ పూర్తయిన తర్వాత పింఛన్లు.. రూ.4 వేల పెంపుపై దృష్టి సారిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీలో వెల్లడించారు.

Tags :

మరిన్ని