Ramoji Rao: ప్రజలకు ఇబ్బందులు కలిగినప్పుడు రక్షా కవచంగా రామోజీరావు నిలిచేవారు: ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌

ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాంతం పరితపించిన వ్యక్తి దివంగత రామోజీరావు అని ఆయన కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Updated : 27 Jun 2024 20:41 IST

ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాంతం పరితపించిన వ్యక్తి దివంగత రామోజీరావు అని ఆయన కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సభను ఏర్పాటు చేసినందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సభను రామోజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సంకల్ప సభగా తమ కుటుంబసభ్యులు భావిస్తున్నట్టు చెప్పారు. అమరావతి నిర్మాణానికి రూ.10కోట్లు విరాళం ప్రకటించారు. 

Tags :

మరిన్ని