Kurnool: వైకాపా సేవలో ప్రభుత్వ వైద్యుడు.. జగన్‌ భజనే ఆయన ప్రవృత్తి!

ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. అందులోనూ వైద్యవృత్తిలో ఉన్నారు. ఆ విషయాన్ని మరిచి వైకాపాతో అంటకాగారు. ఫక్తు వైకాపా కార్యకర్తగా వ్యవహరించిన ఆయన పేరు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి.

Published : 26 Jun 2024 14:46 IST

ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. అందులోనూ వైద్యవృత్తిలో ఉన్నారు. ఆ విషయాన్ని మరిచి వైకాపాతో అంటకాగారు. నిత్యం జగన్‌ను కీర్తిస్తూ.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం, ఫార్వర్డ్ చేయడాన్ని ప్రవృత్తిగా చేసుకున్నారు. ఫక్తు వైకాపా కార్యకర్తగా వ్యవహరించిన ఆయన పేరు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. తాను ప్రభుత్వ ఉద్యోగినన్న విషయం మర్చిపోయి వ్యవహరించారు. గతంలో ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని విమర్శించిన వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి ప్రభాకర్ రెడ్డికి.. జగన్ ప్రభుత్వం కర్నూలు జీజీహెచ్ ఇంఛార్జ్ సూపరింటెండెంట్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికీ అదే పదవిలో ఆయన కొనసాగుతున్నారు.

Tags :

మరిన్ని