Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో.. అదృశ్యమైన యువతి ఆచూకీ లభ్యం

పోలీసులు సవాలుగా తీసుకుంటే ఏ కేసునైనా ఛేదించగలరు అనడానికి ఉదాహరణే ఈ ఉదంతం. తొమ్మిది నెలల కిందట విజయవాడలో అదృశ్యమైన యువతి జాడను కనిపెట్టడంలో ఇన్నాళ్లూ నిర్లిప్తంగా ఉన్న పోలీసులు.. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో పది రోజుల్లోనే జమ్మూలో గుర్తించారు.

Updated : 03 Jul 2024 13:00 IST

అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె తొమ్మిది నెలలుగా కనిపించకపోయే సరికి ఓ తల్లి తల్లడిపోయింది. కొద్ది రోజుల క్రితం ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వద్ద తన గోడును వెల్లబోసుకున్నారు. వెంటనే మాచవరం పోలీసులకు పవన్ కల్యాణ్ ఫోన్ చేసి యువతి ఆచూకీ కనిపెట్టాలని ఆదేశించారు. ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు స్నేహితుడు ట్రాప్ చేసి జమ్మూ తీసుకు వెళ్లినట్లు గుర్తించామని రాష్ట్రానికి తీసుకువస్తున్నట్లు పవన్ కు తెలియజేశారు. దీంతో పోలీస్ యంత్రాంగం పనితీరును పవన్ అభినందించారు.

Tags :

మరిన్ని