Pawan Kalyan: ఆదిత్యారాధన చేసిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌

వారాహి ఏకాదశ దీక్షలో ఉన్న జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) గురువారం ఆదిత్యారాధన క్రతువులో పాల్గొన్నారు.

Published : 05 Jul 2024 16:56 IST

వారాహి ఏకాదశ దీక్షలో ఉన్న జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) గురువారం ఆదిత్యారాధన క్రతువులో పాల్గొన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈ ఆరాధనను నిర్వహించారు. నిత్యం సూర్య నమస్కారాలు ఆచరించే పవన్‌కల్యాణ్‌కు ఇటీవల వెన్ను సంబంధిత సమస్య తలెత్తడంతో వాటిని చేయలేదు. అందుకు ప్రతిగా ఈసారి మంత్రసహిత సూర్య ఆరాధనను నిర్వర్తించారు. సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఆయన ఈ క్రతువును ఆచరించారని జనసేన పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.

Tags :

మరిన్ని