Bhatti Vikramarka: ఏ ఒక్క హామీ వదలం.. గ్యారెంటీలన్నీ అమలు చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి

ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గడువులోగానే రైతు రుణమాఫీ చేసి తీరుతామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పునరుద్ఘాటించారు.

Published : 03 Jul 2024 18:52 IST

ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గడువులోగానే రైతు రుణమాఫీ చేసి తీరుతామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలుచేయకపోతే ప్రజల్ని రెచ్చగొట్టి తిరిగి అధికారం పొందుదామనుకుంటున్న భారాస నేతల ఆశలు నెరవేరవని పేర్కొన్నారు. నాలుగుగోడల మధ్య కాకుండా ప్రజలతో చర్చించి రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. త్వరలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామన్నారు.

Tags :

మరిన్ని