Kakinada: వైకాపా అక్రమ కట్టడాల కూల్చివేత.. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం

కాకినాడలో వైకాపా నాయకుడి అక్రమ కట్టడం కూల్చివేతను మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అడ్డుకున్నారు.

Published : 03 Jul 2024 17:42 IST

కాకినాడలో వైకాపా నాయకుడి అక్రమ కట్టడం కూల్చివేతను మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అడ్డుకున్నారు. ద్వారంపూడి అనుచరుడు బళ్లా సూరిబాబు నగరపాలకసంస్థ అనుమతి లేకుండా రాజ్యలక్ష్మీనగర్‌లో G+1 భవనంపై మరో అంతస్తు నిర్మించారు. ఈ కట్టడాన్ని తొలగించాలని నగరపాలక సంస్థ నోటీసు జారీ చేసినా సూరిబాబు స్పందించలేదు. దీంతో అదనపు అంతస్తు కూల్చివేతకు అధికారులు సిద్ధమవగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం చేశారు. పోలీసులను తోసుకుని భవనం వైపు వెళ్లేందుకు యత్నించారు. వాళ్లపై కేకలు వేస్తూ హంగామా సృష్టించారు. అక్రమ కట్టడం కూల్చేస్తున్న మున్సిపల్ సిబ్బందిని ద్వారంపూడి అనుచరులు దుర్భాషలాడారు. 

Tags :

మరిన్ని