Cyber Crime: ఫెడెక్స్‌ పేరిట సైబర్‌ నేరగాళ్ల మోసం.. రూ.కోట్లు దోపిడీ!

సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త మార్గాలు వెతుక్కుని అమాయకులు ఖాతాల్లోంచి రూ.కోట్లలో నగదును కొల్లగొడుతున్నారు. తాము ఫెడెక్స్ కొరియర్ సంస్థ నుంచి మాట్లాడుతున్నామంటూ మోసాలకు పాల్పడుతున్నారు.

Published : 30 Jun 2024 11:21 IST

సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త మార్గాలు వెతుక్కుని అమాయకులు ఖాతాల్లోంచి రూ.కోట్లలో నగదును కొల్లగొడుతున్నారు. తాము ఫెడెక్స్ కొరియర్ సంస్థ నుంచి మాట్లాడుతున్నామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ‘‘మీ ఆధార్ నెంబర్, బ్యాంకు ఖాతా నెంబర్లు ఇవేనా? మీ ఖాతాల నుంచి రూ.లక్షల్లో అక్రమ లావాదేవీలు జరిగాయి. మీ పేరుతో వచ్చిన పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నాం’’ అంటూ కాల్స్‌ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేటుగాళ్ల మాటలకు బెదరకుండా.. అలాంటి కాల్స్‌కు స్పందించకుండా ఉండటమే ఉత్తమమైన మార్గమని సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు చెబుతున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు